Bandi Sanjay News Latest | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 20 వేల సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మోదీ గిఫ్ట్ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని సేవ చేసే అవకాశం ఉన్నంత కాలం, ప్రతి సంవత్సరం సైకిళ్లు ఇస్తానన్నారు. 20 వేల సైకిళ్ళ పంపిణీ పూర్తయిన తర్వాత మోదీ కిట్ లు కూడా పంపిణీ చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి మోదీ కిట్ లు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కిట్‌లలో స్కూల్ బ్యాగ్‌లు, స్టీల్ వాటర్ బాటిళ్లు, నోట్‌బుక్‌లు మరియు మరెన్నో అవసరమైన వస్తువులు ఉంటాయని పేర్కొన్నారు.
ఒక బాలుడు తరగతి గదిలోకి నమ్మకంగా అడుగు పెట్టడానికి అవసరమైన ప్రతిదీ ఇందులో ఉంటుందన్నారు.










