Sunday 1st March 2026
12:07:03 PM
Home > తాజా > రజినీకాంత్, బాలయ్యకు అరుదైన గౌరవం

రజినీకాంత్, బాలయ్యకు అరుదైన గౌరవం

Balayya and Rajini To Get A Rare Honor Together | సూపర్ స్టార్ రజినీకాంత్, నటసింహం నందమూరి బాలకృష్ణ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఇద్దరు అగ్ర నటులను ప్రత్యేకంగా సన్మానించనున్నారు. గోవా వేదికగా 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ కీలక ప్రకటన చేశారు. సినీ కెరీర్ లో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న రజినీకాంత్, బాలకృష్ణ ను ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలోనే ప్రకటించారు.

భారతీయ సంస్కృతిపై సినిమాల ద్వారా రజినీకాంత్, బాలకృష్ణ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. నవంబర్ 28న గోవాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరగనున్న ముగింపు వేడుకలో ఈ మేరకు రజినీకాంత్, బాలకృష్ణ లకు ప్రత్యేక సన్మానం జరగనుంది.

You may also like
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు
ఇరాన్ దాడులు..చిక్కుకున్న పీవీ సింధు, మంచు విష్ణు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions