Australian Media Insults Virat Kohli | మెల్బోర్న్ ( Melbourne ) వేదికగా ఆస్ట్రేలియా ( Australia ) ఇండియా ( India ) జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మీడియా టీం ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ ( Virat Kohli )ని టార్గెట్ చేసింది.
గురువారం తొలిరోజు ఆట సందర్భంగా విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఓపెనర్ 19 ఏళ్ల కానస్టాస్ ( Sam Konstas ) మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. దింతో కోహ్లీకి 20% మ్యాచ్ ఫీజ్ ను ఐసీసీ జరిమానాగా విధించింది.
ఇదే అదునుగా ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లీని జోకర్ గా చిత్రీకరిస్తూ కథనాలను ప్రచురించింది. ‘క్లౌన్ కోహ్లీ’ ( Clown Kohli ) అంటూ హెడ్ లైన్స్ తో ప్రధాన ఎడిషన్లలో విరాట్ ఫోటోలను ప్రచురించారు. ఆసీస్ మీడియా ప్రవర్తన పట్ల భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఘాటుగా స్పందించారు.
ఆస్ట్రేలియా మీడియా ఇలా హెడ్ లైన్స్ పెట్టడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించడం లేదని ఎందుకంటే గత 13 ఏళ్లుగా మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పుడు లీడ్ వచ్చింది. అందుకే మీడియా ఇలాంటి వాటిని ప్రయోగిస్తుందని రవిశాస్త్రి పేర్కొన్నారు. భారత ఆటగాళ్లకు స్వదేశీ అభిమానులు అండగా ఉండాలన్నారు