Attack On Vikarabad Collector | ఫార్మా కంపెనీ ( Pharma Company ) ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ( Prateek Jain ), కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ( KADA ) చైర్మన్ వెంకట్ రెడ్డిలపై పలువురు లగచర్ల గ్రామస్థులు దాడి చేసిన విషయం తెల్సిందే.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
అలాగే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా సురేష్ అనే వ్యక్తి వ్యవహరించినట్లు తెలుస్తోంది. పట్నం నరేందర్ రెడ్డి ( Patnam Narendar Reddy ) ప్రధాన అనుచరుడే సురేష్ అని కథనాలు వస్తున్నాయి. నిందితుడిగా అనుమానిస్తున్న సురేష్ కాల్ డేటా ( Call Data )ను పోలీసులు పరిశీలించారు.
దాడి జరగడానికంటే గంటల ముందు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా సురేష్ తో మాట్లాడుతున్న సమయంలో పట్నం నరేందర్ రెడ్డి ఆరు సార్లు కేటీఆర్ ( KTR ) తో సంభాషణ జరిపినట్లు తెలుస్తోంది. కాగా గతంలో పలుసార్లు సురేష్ పై పోలీసు కేసు నమోదయినట్లు సమాచారం.