Assembly Elections In Maharastra And Jharkhand | అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర ( Maharastra ), ఝార్ఖండ్ ( Jharkhand ) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ను ప్రకటించింది.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 20న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 9.63 కోట్ల ఓటర్లు ఉన్నారు.
ఇదిలా ఉండగా 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఝార్ఖండ్ లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, 20న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.