Asaduddin Owaisi Honors Khammam JCB Driver | ఖమ్మం ( Khammam )లోని ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు ( Munneru )వాగు వరద ఉదృతిలో చిక్కుకున్న తొమ్మిది మందిని ఓ జేసీబీ డ్రైవర్ ( JCB Driver ) తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడాడు.
భీకర వరదను సైతం లెక్కచేయకుండా ముందుకు వెళ్లి తన జేసీబీతో ఇతరుల ప్రాణాలను కాపాడిన సుభాన్ ఖాన్ ( Subhan Khan ) రియల్ హీరోగా నిలిచాడు. హర్యానా ( Haryana ) రాష్ట్రానికి చెందిన సుభాన్ ఖాన్ వికలాంగుడు.
అయినప్పటికీ ఎంతో ధైర్య సాహసం ప్రదర్శించిన జేసీబీ డ్రైవర్ ను అందరూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) సుభాన్ ఖాన్ ను ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్ దారుసలాం లో జేసీబీ డ్రైవర్ ను సన్మానించి, ధైర్య సాహసాలను కొనియాడారు. ఈ సందర్భంగా, పార్టీ తరఫున రూ.51 వేలను అందించారు.
అలాగే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి సుభాన్ ఖాన్ కు డబల్ బెడ్రూం ఇల్లును కేటాయించాలని ఓవైసీ కోరారు.










