Tuesday 29th April 2025
12:07:03 PM
Home > తాజా > చెర్రీ సినిమాకు రెహమాన్ మ్యూజిక్.. ఏ మూవీకో తెలుసా!

చెర్రీ సినిమాకు రెహమాన్ మ్యూజిక్.. ఏ మూవీకో తెలుసా!

RC Rehman

AR Rehman RamCharan Combo | RRR త‌ర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల కిందట సినిమాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా, గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

ఈ సినిమా గురించి అనౌన్స్‌ మెంట్ వ‌చ్చి చాలా రోజులైంది. ఆ త‌ర్వాత ఎలాంటి అప్‌డేట్ లేదు. 

తాజగా ఈ ఆర్సీ 16 సినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్టుకు లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిచనున్నారు.   

ఈ విషయాన్ని స్వయంగా రెహ‌మానే ధ్రువీక‌రించారు. ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ రామ్ చ‌ర‌ణ్-బుచ్చిబాబు సినిమాకు తాను ప‌ని చేస్తున్నాన‌ని చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్‌తో కలిసి సుకుమార్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. వికలాంగడితో స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్ కు..

ఉప్పెన సినిమా హిట్ అవడంతో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల‌నుకున్నాడు బుచ్చిబాబు. కథ కూడా సిద్ధం కావడంతో ఒక ద‌శ‌లో ఖ‌రారైంది కూడా.

కానీ త‌ర్వాత ఎన్టీఆర్ వేరే క‌మిట్మెంట్లు ఉండ‌టంతో బుచ్చిబాబు సినిమా నుంచి వైదొలిగాడు.

తాజాగా ఈ సినిమా కథకే రామ్ చరణ్ ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో ఉప్పెన విల‌న్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

ఇక హీరోయిన్ విషయానికి వస్తే జాన్వీ కపూర్ లేదా మృణాల్ ఠాకూర్ ఎంపిక చేయాలని మేకర్లు భావిస్తున్నారట. మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

You may also like
Ram Charan
రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్!
గేమ్ ఛేంజర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Ram Charan
రామ్ చరణ్ కు అరుదైన గౌరవం!
rc 16 title
RC16 కి ముహూర్తం ఫిక్స్.. రామ్ చరణ్ సినిమా టైటిల్ ఇదేనా?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions