Anchor Shiva Jyothi On Tirumala Prasadam Controversy Comments | యాంకర్ శివజ్యోతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెల్సిందే. కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆమె ప్రసాదం పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అందులో ‘తిరుమలలో ఖరీదైన ప్రసాదం అడుకుంటున్నాం. రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. వీటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో శివజ్యోతి ఒక వీడియోను పోస్ట్ చేశారు. తన వ్యాఖ్యల మూలంగా ఎవరైనా బాధ పడి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎల్ 1 క్యూలో నిల్చోవడాన్ని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు. అలాగే తన సోదరుడి తరఫున కూడా శివజ్యోతి క్షమాపణ కోరారు. తనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసన్నారు. తన జీవితాన్ని మార్చేసిన శ్రీవారి గురించి తాను తప్పుగా ఎందుకు మాట్లాడుతా అని శివజ్యోతి పేర్కొన్నారు.









