Anchor Anasuya apology to Actress Rashi | ప్రముఖ నటి రాశికి క్షమాపణలు కోరారు యాంకర్ అనసూయ. గతంలో నటిపై చేసిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు తాజగా సారీ చెప్పారు. ఇటీవల హీరోయిన్ల వస్త్రాధరణపై శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో అనసూయ శివాజీ వ్యాఖ్యలపై తనదైన శైలీలో స్పందించారు. మరోవైపు సుమారు మూడేళ్ళ క్రితం ఓ కామెడీ షోలో తనను ఉద్దేశించి అనసూయ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశారని నటి రాశీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ తరుణంలో అనసూయ సోషల్ మీడియా ద్వారా నటికి క్షమాపణలు చెప్పారు. ‘మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుండి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించిన డైరెక్టర్ ను నిలదీయాలి కానీ అప్పుడు నాకు శక్తి సరిపోలేదు. అది పొరపాటే, వెనక్కు వెళ్లి ఇప్పుడు సరిదిద్దలేను. ఆ షోలో డబుల్ మీనింగ్ డైలాగులను ఖండించడం నుంచి ఆ షోను విడిచి పెట్టడం వరకు మీరు నాలో మార్పును గమనించవచ్చు. ఆ కార్యక్రమ దర్శక నిర్మాతలు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా తప్పును అంగీకరిస్తూ, మీకు క్షమాపణలు కోరుతున్నా’ అని అనసూయ పేర్కొన్నారు.








