Allu Arjun Team | అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప ది రూల్’ (Pushpa 2) ప్రీమియర్ షోలో భాగంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో థియేటర్ కు వచ్చిన హీరో అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు.
ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది.
“నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం” అని తెలిపింది.