Aishwarya Rai Touches PM Narendra Modi’s Feet | ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు నటి ఐశ్వర్యారాయ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పుట్టపర్తిలో బుధవారం సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యారాయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ మాట్లాడుతూ సత్యసాయి బాబా బోధనలు, జీవితం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు ఐశ్వర్య.
శారీరకంగా ఆయన లేకపోయినా లక్షలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. అలాగే శత జయంతి ఉత్సవాలల్లో పాల్గొన్నందుకు ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన ప్రసంగం ముగిసిన అనంతరం ఐశ్వర్యారాయ్ ప్రధాని వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు. ఆమెను ప్రధాని ఆశీర్వదించారు.









