Actor Vikrant Massey News | బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సంచలన నిర్ణయం తీసుకున్నారు.
12త్ ఫెయిల్ ( 12th Fail ) మూవీతో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను తనవైపు మళ్లించుకున్న విక్రాంత్ తాజగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాడు. ఆయన తీసుకున్న సడెన్ డెసీషన్ ( Sudden Decision ) తో అభిమానులు షాక్ కు గురయ్యారు.
కుటుంబానికి సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో కొంత కాలం వరకు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.
“గత కొన్ని సంవత్సరాలుగా అభిమానుల నుండి వెలకట్టలేని ప్రేమను, ఆప్యాయతను పొందాను, మీ అభిమానానికి, మద్దతును ధన్యవాదాలు. ఫ్యామిలీకి నా సమయాన్ని కేటాయించాల్సిన టైం వచ్చింది. మళ్లీ సరైన సమయం వచ్చే వరకు కొత్త సినిమాలు చేయను, 2025లో విడుదలయ్యే సినిమానే చివరిది” అంటూ సోషల్ మీడియా ( Social Media )లో విక్రాంత్ పోస్ట్ చేశారు.
ఈ పోస్టుపై స్పందిస్తున్న ఫ్యాన్స్ అసలు ఏం అయింది అని ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు. కానీ మరికొంతమంది మాత్రం ఇది సినిమా ప్రమోషన్స్ ( Promotions ) లో భాగం అయ్యే అవకాశం ఉందని కామెంట్లు పెడుతున్నారు.