A short conversation between Lionel Messi and LoP Rahul Gandhi at the Hyderabad stadium | అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి హైదరాబాద్ పర్యటన అద్భుతంగా జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా భాగం అయ్యారు. ఫలకనూమా ప్యాలెస్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ అలాగే ఎంపీ ప్రియాంక గాంధీ పిల్లలు కూడా పాల్గొన్నారు.
ఇకపోతే శనివారం రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జీతీయ స్టేడియం లో జరిగిన ఈవెంట్ హైలెట్ గా నిలిచింది. ఎగ్జిబిషన్ మ్యాచులో పాల్గొన్న ఇరు జట్లకు అవార్డులు ప్రధానం చేశారు మెస్సి. వేదికపై మెస్సి నిల్చోగా ఓ పక్కా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో పక్క రాహుల్ గాంధీ నిల్చున్నారు. ఈ సమయంలో మెస్సి-రాహుల్ గాంధీ మధ్య సాగిన సంభాషణ ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది.
అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలో మెస్సి-రాహుల్ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు ఏం మాట్లాడుకుని ఉండొచ్చు అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మెస్సికి స్పానిష్ భాష మాత్రమే వచ్చు. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో స్పానిష్ లో ఏమి సంభాషించి ఉండొచ్చు అనే ఆసక్తి నెలకొంది. ఇకపోతే తన అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు జెర్సీపై మెస్సి ఆటోగ్రాఫ్ చేసి వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి బహుమతిగా ఇచ్చారు









