మాయదారి మహమ్మారి రోగం కరోనా నుంచి రక్షించుకోవడానికి ప్రస్తుత్తం మాస్క్ ఒక్కటే ఆయుధం. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత దేశంలోని అన్ని నగరాల్లో జన సంచారం పెరిగిపోయింది. దాదాపు మళ్లీ మునపటి రోజుల సందడి కనిపిస్తోంది. దీంతో కరోనా రక్షించుకోవడానికి భౌతిక దూరం పాటించడం, మాస్క్ వాడకం తప్పనిసరి అయింది.
అయితే ఏ మాస్క్ కరోనా నుంచి సమర్థవంతంగా రక్షింస్తుందనే విషయంలో చాలా సందేహాలు తలెత్తున్నాయి. చాలామంది సర్జికల్ మాస్కులు, బ్రాండెడ్ రెస్పిరేటరీ మాస్కులు, ఎన్95 మాస్కులు ధరిస్తున్నారు. కొంతమంది రోజు కొత్త మాస్కులు కొనుక్కోలేని వాళ్లు, ఖరీదైన మాస్కులు కొనుగోలు చేయలేని వాళ్లు సొంతంగా ఇంట్లో వాడే వస్త్రాలతో మాస్కులు తయారు చేసుకుంటున్నారు.
రెండు మూడు జతల మాస్కులు తయారు చేసుకొని వాటినే రోజు శుభ్రం చేసుకొని వాడుకుంటున్నారు. కొంతమంది సెలెబ్రిటీలు కూడా చేనేత వస్త్రాలతో తయారు చేసిన మాస్కులు వాడుతున్నారు. దీంతో ప్రసుత్తం క్లాత్ మాస్కులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇలాంటి మాస్కులు సురక్షితమేనా? కరోనా వైరస్ నుంచి ఇవి రక్షిస్తాయా అనే అనుమానం ఉంది.
అయితే క్లాత్ మాస్కుల విషయంలో భయం అక్కర్లేదంటున్నారు ప్రముఖ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆప్ ఇల్లినాయిస్ పరిశోధకులు. పలు రకాల ఫేస్ మాస్కులపై వివిధ పరిశోధనలు జరిపిన పరిశోధకులు మార్కెట్లో లభించే పలు రకాల మాస్కుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులే ఉత్తమమైనవని సూచించారు.
కేవలం కరోనా సోకిన వ్యక్తే కాకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు ఎదుటి వ్యక్తి దరి చేరకుండా నిలువరించడంలో క్లాత్ మాస్కులు సమర్థవంతంగా పని చేస్తాయిని పోషిస్తాయని కీలక విషయాలు వెల్లడించారు. సాధారణ వస్త్రంతో తయారు చేసిన మాస్కులు మెడికల్ మాస్కుల కంటే ఏమాత్రం తీసిపోవని తెలిపారు. పైగా శ్వాస పీల్చుకోవడానికి కూడా ఇవి అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని పేర్కొన్నారు.
సో ఇంక చింత లేదు. ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి, బ్రాండెడ్ మాస్కులు ధరించడం కన్నా ఎంచక్కా ఇంట్లో స్వయంగా తయారు చేసుకున్న మాస్కులే ఉపయోగించుకోండి. కరోనా బారి నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోండి.