A disturbing trend is going viral on X | ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాటఫార్మ్ ‘ఎక్స్’ లో ఓ దారుణ ట్రెండ్ నడుస్తోంది. యూజర్ల కోరిక మేరకు గ్రోక్ ఏఐ మహిళల ఫోటోలను మార్ఫ్ చేస్తుంది. యువతుల సాధారణ ఫోటోలను యూజర్లు అప్లోడ్ చేసి ఈ అమ్మాయిని బికినీలోకి మార్చవా అని గ్రోక్ ను ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఎలాంటి సంకోచం లేకుండా ఎలాన్ మస్క్ గ్రోక్ యువతుల ఫోటోలను అసభ్యకరంగా మార్చేస్తుంది. దీని పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ దారుణమైన ట్రెండ్ ను వెంటనే ఆపేయాలని ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ ను కోరుతున్నారు కొందరు. గత కొన్నిరోజులుగా ఈ ట్రెండ్ హద్దులు మీరిపోయింది.
ప్రముఖ హీరోయిన్ల, నటీమణుల అలాగే సాధారణ యువతుల, మహిళల ఫోటోలను కొందరు యూజర్లు ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. అనంతరం ఈ ఫొటోలో యువతిపై ఉన్న దుస్తువులను తొలగించి బికినీలోకి మార్చమని, నగ్నంగా మార్చాలని గ్రోక్ కు ప్రాంప్ట్ ఇస్తున్నారు. ఆ వెంటనే గ్రోక్ యూజర్ కోరినట్లుగా అమ్మాయిల ఫోటోలను మార్చేస్తుంది. ఇతర ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ యాప్స్ లో యూజర్ ఏమీ వెతికినా గోప్యంగా ఉంటుంది. కానీ ఎక్స్ లో అలా ఉండదు. యూజర్లు చేస్తున్న పోస్టులు అందరికీ కనిపిస్తాయి. దింతో మహిళల ఫోటోలను గ్రోక్ అసభ్యంగా మార్చుతున్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ట్రెండ్ ఎటు దారి తీస్తుందో అని ఆందోళనను వ్యక్తం అవుతున్నాయి.









