Rs. 18000 For 400 Meters | ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అమెరికన్ మహిళను టాక్సీ డ్రైవర్ మోసం చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
విమానాశ్రయం నుంచి కేవలం 400మీటర్ల దూరం ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళ్లేందుకు టాక్సీ ఎక్కిన ఆమె నుంచి డ్రైవర్ రూ.18,000లు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు టాక్సీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, జనవరి 12న అమెరికా నుంచి ముంబైకి వచ్చిన మహిళ విమానాశ్రయం వద్ద టాక్సీ తీసుకుంది. కానీ డ్రైవర్ ఆమెను నేరుగా హోటల్‌కు తీసుకెళ్లకుండా అంధేరి (ఈస్ట్) ప్రాంతంలో సుమారు 20 నిమిషాలు తిప్పి చివరకు అదే హోటల్ వద్ద దించాడు. ఆ సమయంలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనను ఆ మహిళ జనవరి 26న ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, డ్రైవర్ అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.





