Virat Kohli reclaims ICC ODI No.1 ranking for first time in 5 years | టీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సుమారు ఐదేళ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానం చేరుకున్నారు. ఇటీవలి వరకు తొలి స్థానంలో కొనసాగిన రోహిత్ శర్మ మూడవ స్థానంలోకి పడిపోయారు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ రెండవ స్థానంలోకి ఎగబాకారు. గతేడాది సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో అలాగే ఆదివారం న్యూజిలాండ్ తో ముగిసిన తొలి వన్డేలో విరాట్ అద్భుత ఫార్మ్ ను కనబరిచిన విషయం తెల్సిందే. ఇలా వరుస మ్యాచుల్లో సెంచరీలు, హాఫ్ సెంచరీలతో చెలరేగిపోతున్న కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ పట్టికలో 12 పాయింట్లను సొంతం చేసుకుని తొలి స్థానంలో నిలిచారు. ఈ మేరకు బుధవారం ఐసీసీ ఈ ర్యాంకింగ్స్ ను వెల్లడించింది.
2021 ఏప్రిల్ 2న కోహ్లీ తన నంబర్ 1 ర్యాంక్ ను కోల్పోయారు. మళ్లీ ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తిరిగి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ ఐదవ, శ్రేయస్ అయ్యర్ 10వ, కేఎల్ రాహుల్ 11వ స్థానంలో కొనసాగుతున్నారు.









