Suresh Gopi Sings Telugu Song | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన ‘అలా వైకుంఠపురం’ లోని సామజవరగమన పాటను ఎంతో అద్భుతంగా అలపించి అందరి మనసు గెలుచుకున్నారు కేంద్రమంత్రి, మలయాళ స్టార్ నటుడు సురేష్ గోపి. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ గ్రౌండ్స్ లో జరిగిన ‘జీవిఎల్ సంక్రాంతి సంబరాలు’ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సురేష్ గోపి. అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అనంతరం ప్రసంగించారు.
ఈ సందర్భంగా తెలుగు భాష, చిత్ర పరిశ్రమతో తనకున్న అనుంబంధాన్ని పంచుకున్నారు. ఇదే సమయంలో సామజవరగమణ పాట పాడి అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఇకపోతే విశాఖ, ఉత్తర కోస్తా జిల్లాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ప్రాజెక్టులు మంజూరు చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు జీవిఎల్ నరసింహారావు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు.









