CM Revanth Requests AP CM | ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)తో నీటి పంపకాల విషయంలో తెలంగాణ (Telangana)లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో నీటి వివాదానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవాలని తాము చూడటం లేదు. గొడవల కంటే పరిష్కారమే మాకు ఎక్కువ ముఖ్యం. రాజకీయాలకు అతీతంగా జల వివాదాలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ సహకరిస్తే తాము కూడా సహకరిస్తామని చెప్పారు.
పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తమకు లేదనీ, పరిష్కారం కోసమే తాము చూస్తున్నామని ప్రకటించారు. పంచాయతీలు కావాలా నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతానన్నారు.
కృష్ణానది (Krishna River) పై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు అడ్డంకులు పెట్టొద్దంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. తాము రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజల ప్రయోజనాల కోసమే చూస్తున్నమని చెప్పారు.
తాము పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. నీళ్ల విషయంలో ఏపీ సర్కార్ ఒక్క అడుగు ముందుకు వేస్తే తెలంగాణ 10 అడుగులు వేస్తుందని తెలిపారు.









