Janasena Party News | జనసేన పార్టీకి భారీ విరాళం అందజేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు మరియు ఆయన సన్నిహితులు. ఈ మేరకు రూ.48 లక్షలను డీడీ రూపంలో జనసేన పార్టీ కోశాధికారి రత్నంకు అందజేశారు. “నా సేన కోసం నా వంతు”గా జనసేన పార్టీకి రూ.48 లక్షలు డీడీ రూపంలో అందజేశారు.
చంద్రునికో నూలుపోగుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు చేస్తున్న సేవల్లో తాము సైతం భాగమవ్వాలనే ఆలోచనతో ఈ ఏడాది కూడా జనసేన పార్టీకి తమ వంతుగా రూ.48 లక్షలు డీడీల రూపంలో అందజేసినట్లు, త్వరలో మరో రూ.2 లక్షలు కూడా డీడీ ద్వారా పార్టీకి అందజేయనున్నట్లు తద్వారా రూ.50 లక్షలు సమకూరుతాయని నాగబాబు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ స్పూర్తితో నూతన సంవత్సరం సందర్భంగా ఈ విరాళం అందజేసినట్లు వారు తెలిపారు.









