Harish Rao mortgaged his house to help a PG medical student secure an education loan | మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు గొప్ప మనసును చాటుకున్నారు. పేద విద్యార్థిని చదువు కోసం తన స్వగృహాన్ని తాకట్టు పెట్టారు. విద్యార్థిని పీజీ వైద్య విద్య రుణం కోసం బ్యాంకులో తన స్వగృహన్ని మార్టిగేజ్ చేశారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చింది. అయితే ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ. 7.50 లక్షలు, మూడేళ్లకు కలిపి రూ.22.50 లక్షలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది.
ఈ క్రమంలో బ్యాంకు లోన్ కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీన ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థిని మమత, ఆమె తండ్రి కొంక రామచంద్రం. ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించిన హరీష్ సిద్దిపేటలోని తన స్వగృహన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ. 20 లక్షల ఎడ్యూకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజు కూడా రూ.లక్ష ఇచ్చారు. గతంలో ఆటో కార్మికుల కోసం కూడా హరీష్ రావు తన ఇంటిని తనఖా పెట్టిన విషయం తెల్సిందే.









