Deputy Cm Pawan Kalyan News | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. అంధ క్రికెటర్ల కుటుంబాలకు గృహోపకరణాలు అందించారు. ప్రపంచ కప్ సాధించిన అంధుల మహిళల క్రికెట్ జట్టు ఇటీవలే పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన విషయం తెల్సిందే. ఈ జట్టు కెప్టెన్ దీపిక, ప్లేయర్ కరుణ కుమారి ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు అనే విషయం తెల్సిందే. మ్యాచ్ ఫీజుతో కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామన్న జట్టు కెప్టెన్ దీపిక మాటలకు పవన్ చలించిపోయారు.
దింతో తక్షణమే స్పందించిన పవన్ ఇద్దరు క్రికెటర్లకు గృహోపకరణాలు అందించాలని అధికారులకు ఆదేశించారు. జట్టు కెప్టెన్ దీపిక, సభ్యురాలు పాంగి కరుణ కుమారి కుటుంబాలకు టీవీ, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపించారు పవన్. అలాగే క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.









