CM Revanth Reddy Scores in GOAT Cup Penalty Shootout | ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటతీరు అందర్నీ ఆశ్చర్య పరిచింది. 56 ఏళ్ల వయసులోనూ ఆయన యువకులతో పోటీ పడుతూ పరిగెత్తడం, గోల్ కొట్టడం, ఆ తర్వాత మెస్సి మరియు ఇతర ఫుట్బాల్ ఆటగాళ్లతో కలిసి ఫుట్బాల్ ఆడడం ఇలా కార్యక్రమం జరిగినంత సేపు సీఎం జోష్ లో కనిపించారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సి మరియు రోడ్రిగో, సువారేజ్ ఓ వైపు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు నిల్చొని ఫుట్బాల్ సాధన చేసిన వీడియోలు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో 56 ఏళ్ల వయసులో ఉన్న ముఖ్యమంత్రి ఫిట్నెస్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎగ్జిబిషన్ మ్యాచులో భాగంగా సింగరేణి ఆర్ఆర్ 9 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సీఎం, అపర్ణ మెస్సి జట్టుపై గోల్ కొట్టారు. అలాగే సీఎం రేవంత్ జట్టు ఈ మ్యాచులో విజయం సాధించింది. అనంతరం మెస్సితో పాటు సీఎం రేవంత్ మైదానం మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. ఫుట్బాల్ ను స్టాండ్స్ లోకి కిక్ చేయమని మెస్సి సీఎం రేవంత్ కు సూచించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ మనవడు కూడా కాసేపు ఫుట్బాల్ ఆడారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం..మెస్సికి స్వాగతం పలికారు. అలాగే తెలంగాణ రైజింగ్ లో భాగం అవ్వాలని పిలుపునిచ్చారు.









