BRS Jagadish Reddy’s Father Ramachandra Reddy Won in Sarpanch Election | తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి దశ గురువారం ముగిసింది. అధికార కాంగ్రెస్ మద్దతుదారులు అధిక స్థానాల్లో గెలుపొందారు. ఇకపోతే బీఆరెస్ బలపరిచిన అభ్యర్థులు కూడా గట్టిపోటీ ఇచ్చారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా నాగారం పంచాయతీలో సర్పంచ్ గా ఘన విజయం సాధించారు మాజీ మంత్రి, బీఆరెస్ నేత జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డి. 95 ఏళ్ల వయసులో ప్రత్యర్థులతో కలబడి సర్పంచ్ గా ఆయన గెలవడం ఆసక్తిగా మారింది.
ఈ నేపథ్యంలో బీఆరెస్ అధినేత కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. తండ్రి విజయం గురించి జగదీష్ రెడ్డి కేసీఆర్ కు తెలియజేయగా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం, ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం అని కేసీఆర్ పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని కేసీఆర్ అభిలాషించారు.









