Rs.10 lakh for photograph with Lionel Messi | అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సి మూడు రోజుల పర్యటన కోసం భారత్ కు రానున్నారు. డిసెంబర్ 13న ఆయన భారత్ కు వస్తారు. ‘ది గోట్ టూర్ ఆఫ్ ఇండియా-2025’ లో భాగంగా మెస్సి కోల్కత్త, హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ నగరాల్లోని అభిమానులను కలుస్తారు. ఇకపోతే హైదరాబాద్ కు రానున్న మెస్సితో ఫోటో దిగాలి అంటే చాలా ఖర్చు అవుతుంది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అనంతరం ఫలకనుమా ప్యాలెస్ లో మెస్సితో ‘మీట్ అండ్ గ్రీట్’ ఉండనుంది. ఈ సమయంలో మెస్సితో ఫోటో దిగాలి అంటే మాత్రం రూ.10 లక్షలు చెల్లించాల్సిందే. ఈ మేరకు మెస్సి హైదరాబాద్ పర్యటన వివరాలను మీడియాతో పంచుకున్నారు ది గోట్ ఇండియా టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి.
శనివారం సాయంత్రం మెస్సి హైదరాబాద్ లో అడుగుపెడుతారని ఆమె పేర్కొన్నారు. ఉప్పల్ లో ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం ఫలకనుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ఈ సమయంలో మెస్సితో ఫోటో దిగే అవకాశం ఉంటుందని, కానీ ఫోటో దిగాలి అని అనుకునే వారు రూ.9.95 లక్షలు జీఎస్టీ అదనంగా చెల్లించాలని తెలిపారు. అయినప్పటికీ కేవలం 100 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పార్వతిరెడ్డి స్పష్టం చేశారు.









