Bankim Babu, not Bankim Da | శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత జాతీయ గేయం వందేమాతరం (Vandemataram) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ ప్రత్యేక చర్చను నిర్వహించింది.
ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వందేమాతరం గేయ రచయిత ప్రసిద్ధ బెంగాలీ కవి బంకిం చంద్ర చటోపాధ్యాయను “బంకిం దా” అని సంబోధించారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ ప్రధాని వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సాధారణంగా సోదరుడు అని సంభోదించేందుకు బెంగాలీలో దా అని వాడుతారనీ, అయితే బంకించంద్ర ఛటర్జీ లాంటి గొప్ప రచయితకు అది గౌరవప్రదంగా లేదన్నారు. దానికి బదులుగా మీరు బంకిం బాబు అని చెప్పాలని సూచించారు.
దానికి వెంటనే స్పందించిన ప్రధాని మోదీ ఇక నుంచి బంకిం బాబు అని సంభోదిస్తానని చెప్పారు. తన పొరపాటును సరిదిద్దినందుకు సౌగత్ రాయ్ కు ధన్యవాదాలు చెప్పారు.









