BRS Leader Jagadeesh Reddy Father News | తన శేష జీవితం గ్రామానికే అంకితం అంటున్నారు మాజీ మంత్రి, బీఆరెస్ నేత జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డి. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులుగా యువత పోటీ పడి మరీ నామినేషన్లు వేస్తున్నారు. ఇదే సమయంలో అనుభవం ఉన్న పెద్దలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా నాగారం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు 95 ఏళ్ల రామచంద్రా రెడ్డి. ఆయన వయసు 95 ఏళ్ళు. అయినప్పటికీ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలనే ఉద్దేశ్యంతోనే పోటీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన శేష జీవితం గ్రామాభివృద్ధికి అంకితం అంటున్నారు. మరోవైపు తండ్రి గెలుపు కోసం జగదీష్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.









