Shiva Rajkumar To Lead Telugu Biopic On Ex-MLA Gummadi Narsaiah’s Real-Life | విప్లవ పార్టీ నేత, ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైనా అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న గుమ్మడి నర్సయ్య జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోగ్రఫీగా తెరకెక్కుతున్న ‘గుమ్మడి నర్సయ్య’ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఈ క్రమంలో కారేపల్లి మండలంలోని టేకులగూడెంలోని గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్లారు శివరాజ్ కుమార్ దంపతులు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో శనివారం జరిగిన కార్యక్రమంలో సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ..ప్రజల మనిషిగా పేరొందిన గుమ్మడి సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే పూర్తి స్థాయిలో తెలుగు నేర్చుకోనున్నట్లు, ఈ సినిమాలో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నట్లు శివరాజ్ కుమార్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావలనుకునే యువత కచ్చితంగా ఈ సినిమాను వీక్షించాలన్నారు.









