Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: హైకోర్టు!

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: హైకోర్టు!

Live In Releationship

High Court Comments on Live In Relationship | కొంతకాలంగా మనదేశంలో కూడా సహజీవనం (Live In) అనే ట్రెండ్ కొనసాగుతోంది. చాలా మంది యువత పెళ్లి చేసుకొకుండా కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సహజీవనం పై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

చట్ట ప్రకారం పెళ్లికి అర్హతగా నిర్ధారించిన వయస్సు రానప్పటికీ యువతీయువకులు మేజర్లయితే ఇద్దరి అంగీకారంతో సహజీవనం చేయొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడి సహజీవనం కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

రాష్ట్రానికి చెందిన ఓ యువజంట కొద్ది రోజులుగా సహజీవనం చేస్తోంది. అయితే యువతి కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందని వారి కోర్టును ఆశ్రయించారు. తామిద్దరమూ పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్నామని కోర్టుకు విన్నవించారు.

ఈ క్రమంలో ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు వివాహ వయస్సు రాలేదన్న కారణంగా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కును కాదనలేమని పేర్కొంది.

యువకుడికి వివాహ వయస్సు రాలేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేమని.. దీనిని నేరంగా కూడా చూడలేమని జస్టిస్ అనూప్ ధండ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions