Maxwell Ends 13-Year IPL Stint | ఐపీఎల్ మినీ ఆక్షన్-2026 ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన విషయం తెల్సిందే. ఆయన కోల్కత్త నైట్ రైడర్స్ తరఫున కోచింగ్ స్టాఫ్ లో చేరారు. ఇకపోతే ఫాఫ్ డు ప్లీసిస్, మెయిన్ అలీ ఐపీఎల్ బదులు పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడనున్నారు. తాజగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, బిగ్ షోగా పిలవబడే గ్లెన్ మాక్స్ వెల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఐపీఎల్ మినీ ఆక్షన్ కోసం తన పేరును నమోదు చేసుకోవడం లేదని ప్రకటించారు. ఐపీఎల్ కు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటానని పేర్కొన్న మాక్స్ వెల్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తన కెరీర్ లో ఐపీఎల్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీలకు, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఆశతో త్వరలో కలుద్దాం అని పేర్కొన్నారు.
అంటే ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే 2025 సీజన్ లో పంజాబ్ తరఫున ఆడిన మాక్స్ వెల్ కేవలం ఏడు మ్యాచులు ఆడి 48 పరుగులే చేసి, నాలుగు వికెట్లతో పేలవ ప్రదర్శన కనబరిచాడు.









