Andre Russell Announces IPL Retirement | వెస్ట్ ఇండీస్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో భాగంగ కోల్కత్త నైట్ రైడర్స్ తరఫున దశాబ్దానికి పైగా ప్రాతినిధ్యం వహించిన ఆండ్రీ రస్సెల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ కెరీర్ కు వీడ్కోలు పలికారు. కానీ కోల్కత్త జట్టుతోనే కలిసి ఉంటానని రస్సెల్ ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
‘నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నా. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగ్ లో కేకేఆర్ ఫ్రాంచైజీ తరఫున ఆడుతా. ఐపీఎల్ లో అద్భుత క్షణాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. కేకేఆర్ యాజమాన్యంతో చర్చించిన తర్వాత ఆ జట్టుకు పవర్ కోచ్ గా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. కోల్కత్త జట్టు సపోర్టింగ్ స్టాఫ్ లో భాగం అవుతున్నా. నేను ఐపీఎల్ లో కేకేఆర్ జర్సీలో తప్పా ఇతర జట్టు జర్సీలో ఉహించుకోలేకపోతున్నా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని రస్సెల్ పేర్కొన్నారు.
2012లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రస్సెల్ తొలి సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడారు. 2014లో కేకేఆర్ కు వచ్చిన రస్సెల్ 2025 వరకు అదే ఫ్రాంచైజీతో ఉన్నారు. 2025 మెగా ఆక్షన్ ముందు రూ.12 కోట్లకు రస్సెల్ ను కోల్కత్త రిటైన్ చేసుకుంది. అయితే తాజాగా అతన్ని రిలీజ్ చేసింది. ఇకపోతే 2014, 2024లో కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవడంతో రస్సెల్ కీలకంగా వ్యవహరించారు.









