Did Palash Muchhal cheat on Smriti Mandhana? | టీం ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతీ మంధాన వివాహం వాయిదా పడడం కాస్త వివాదంగా మారింది. స్మృతి-ఫిల్మ్ మేకర్ పలాశ్ ముచ్చల్ వివాహం నవంబర్ 23 ఆదివారం రోజు మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సి ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందే వివాహాన్ని వాయిదా వేశారు.
స్మృతి తండ్రి గుండెపోటు లక్షణాలతో ఇబ్బంది పడడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు మంధాన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం పలాశ్ కూడా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్మృతి వివాహం వాయిదా పడింది. కానీ వివాహం వాయిదా పడడానికి బయటకు చెప్పని కారణాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్మృతిని పలాశ్ మోసం చేశారని, అతను వేరే అమ్మాయితో రహస్యంగా డేటింగ్ చేస్తూ దొరికిపోవడంతోనే వివాహం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతుంది.
ఇదే సమయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలను స్మృతి తన సోషల్ మీడియా ఖాతా నుండి డిలీట్ చేశారు. అలాగే స్మృతి స్నేహితురాలు, క్రికెటర్ రాధా యాదవ్ పలాశ్ ను అన్ ఫాలో చేశారు. ఇలాంటి పరిణామాలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.









