YS Jagan and KTR Attend Private Event in Bengaluru | మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కనిపించారు. వీరిద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉండడంతో వీరి కలయికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. వైసీపీ, బీఆరెస్ శ్రేణులు వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
బెంగళూరు వేదికగా శనివారం సాయంత్రం జరిగిన ‘ది సర్జ్ ఈక్వెస్ట్రియన్’ లీగ్ ముగింపు వేడుకలో జగన్, కేటీఆర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బెంగళూరులోని సర్జ్ స్టేబుల్ సంస్థలో అంతర్జాతీయ గుర్రపు స్వారీ పోటీలు జరిగాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు జగన్, కేటీఆర్ కలిసి ట్రోఫీలు ప్రధానం చేశారు. ఈ పోటీల్లో అంతర్జాతీయ రైడర్లు సైతం పాల్గొన్నారు.









