Rajamouli News Latest | గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన విషయం తెల్సిందే. ఆయనపై పలువురు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అలాగే పలు హిందూ సంఘాలు ఇప్పటికే దర్శకుడిపై ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకులు హర్షకుమార్ స్పందించారు.
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన రాజమౌళిపై బీజేపీ మరియు అనుబంధ సంఘాలు చేస్తున్న విమర్శలను నమోదు చేసిన కేసులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచి మరో ఆస్కార్ అవార్డును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న రాజమౌళిని అభినందించాల్సింది పోయి రాజకీయ లబ్ది కోసం వివాదాల్లోకి లాగడం సిగ్గు చేటన్నారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో మన పురాణాల గొప్పతనాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఏకైక దర్శకుడు రాజమౌళి అని కొనియాడారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమౌళికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు హర్షకుమార్ ప్రకటించారు. రాజకీయ స్వలాభం కోసం కళాకారుల స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలను సహించేదే లేదన్నారు.









