Travis Head’s 69-ball ton secures remarkable two-day win for Australia | ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఇందులో ఆస్ట్రేలియా ఎనమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచుల సిరీస్ లో శుభారంభం చేసింది.
ట్రావిస్ హెడ్ ఊచకోత కారణంగా ఆస్ట్రేలియా అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించింది. మూడు ఇన్నింగ్స్ లో ఇరు జట్లు 200 పరుగులు కూడా చేయడానికి కష్టపడ్డ పిచ్ పై ట్రావిస్ హెడ్ మాత్రం టీ-20 స్టైల్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. కేవలం 83 బంతుల్లోనే 16 ఫోర్లు, 4 సిక్సులతో 123 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 28.2 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులు చేసింది, ఇందులో మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లతో విజృంభించాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో మాత్రం ఘోరంగా విఫలం అయ్యింది. కేవలం 132 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.ఇక ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో 164 పరుగులకే కుప్పకూలింది. బోలాండ్ 4, స్టార్క్ 3, డొగెట్ మూడు వికెట్ల చొప్పున తీశారు. ఈ నేపథ్యంలో 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించింది. ట్రావిస్ హెడ్ సెంచరీకి తోడుగా లబునస్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచులో 10 వికెట్లు తీసిన స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.









