YS Jagan News | మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సుధీర్ఘ విరామం తర్వాత కోర్టు మెట్లెక్కారు. ఆస్తుల కేసుకు సంబంధించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై సీబీఐ అభ్యంతరం తెలుపుతూ జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని వాధించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు నవంబర్ 21 లోపు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ గురువారం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరు అయ్యారు.
గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బేగంపేట విమానాశ్రయంకు జగన్ చేరుకున్నారు. ఇక్కడ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జగన్ కోర్టుకు వస్తున్న క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా ఆస్తుల కేసుకు సంబంధించి జగన్ చివరి సారిగా 2020 జనవరి 10న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత కోర్టుకు హాజరవుతున్నారు. మెుత్తం 11 ఛార్జ్ షీట్ల విచారణలో భాగంగా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హజరవుతున్నారు.









