Madvi Hidma Encounter | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కీలక నేత, మోస్ట్ వాంటెడ్ మద్వి హిడ్మా మృతి చెందారు.
అలాగే హిడ్మా సతీమణి రాజే మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కాల్పుల్లో హిడ్మా, ఆయన భార్య రాజే మరియు అనుచరులు చెల్లూరి నారాయణ, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు.
మరోవైపు ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలోనూ కాల్పులు జరగగా ఒక మావోయిస్టు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కీలక సభ్యులు ఇటీవలే జనజీవన స్రవంతిలో కలిసిన విషయం తెల్సిందే. అప్పటి నుండి భద్రతా బలగాలు హిడ్మా కోసం గాలిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు హిడ్మా మృతి చెందిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది.









