Car Hangs Mid Air | కేరళలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 66 పై నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ పైకి ఎక్కిన మధ్యలో ఉన్న గ్యాప్ లో చిక్కుకుపోయింది. కన్నూర్ జిల్లా తలస్సేరి-కన్నూర్ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తలస్సేరి నుంచి కన్నూర్ దిశగా వెళ్తున్న కారు వార్నింగ్ బారికేడ్లను గమనించకుండా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. ఆ ఫ్లైఓవర్ రెండు సెక్షన్ల మధ్య పనులు పూర్తికాకపోవడంతో మధ్యలొ ఉన్న గ్యాప్ లో కారు పడిపోయింది.
దీంతో కారు బ్రిడ్జిపై నుంచి కిందకు వేళాడింది. డ్రైవర్ వెంటనే కారులో నుంచి బయటకు వచ్చాడు. వెంటనే స్థానికులు, అధికారుల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టి కారును కిందకు జారకుండా నియంత్రించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.









