Bandi Sanjay News | హైదరాబాద్ శివారు పోచారం ఐటీ కారిడార్ వద్ద గో సంరక్షకుడు ప్రశాంత్ సింగ్ అలియాస్ సోనుపై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన సోను సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ క్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సోనును పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ఓట్లు, డబ్బుల కోసమే సోను ఇలా చేస్తున్నాడు అంటూ అభాండాలు మోపడం దారుణం అని అన్నారు. గోవధ చట్టాన్ని పోలీసులు అమలు చేయలేని దుస్థితిలో సోను ఆ పని చేస్తే అతనిపైనే నిందలు మోపడం సరికాదన్నారు.
అలాగే సోనుపై కాల్పులు జరిపిన ఎంఐఎం కార్యకర్త ఇబ్రహీంకు తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందని బండి ప్రశ్నించారు. గత బీఆరెస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గో సంరక్షకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, వారికి రక్షణ లేకుండా పోయిందన్నారు. తమ ఓపికని పిరికితనంగా భావించొద్దని ఖబడ్దార్ అంటూ బండి హెచ్చరించారు.









