RO-KO disappoints | ఆస్ట్రేలియా-టీం ఇండియా మధ్య తొలి వన్డే మ్యాచ్ ఆదివారం ఉదయం మొదలయ్యింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి టీం ఇండియా తొలుత బ్యాటింగ్ దిగింది. ఈ క్రమంలో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు.
గిల్ తో కలిసి ఓపెనింగ్ కు దిగిన రోహిత్ 14 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి హెజిల్వుడ్ బౌలింగ్ లో వెనుదిరిగారు. విరాట్ కోహ్లీ అయితే 8 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే స్టార్క్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టారు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తోనే రోహిత్, కోహ్లీ భవిష్యత్ ఆధారపడిందనే విశ్లేషణలు వస్తున్న తరుణంలో ఈ దిగ్గజ ఆటగాళ్లు ఇలా విఫలం అవ్వడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత సుమారు ఏడు నెలల విరామం అనంతరం రో-కో జోడి అంతర్జాతీయ క్రికెట్ ను ఆడుతుంది. దింతో వీరిద్దరిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఇలా విఫలం అవ్వడంతో ఆందోళన చెందుతున్నారు.









