YS Jagan About Digital Book | పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ను ప్రారంభించారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. ఈ మేరకు బుధవారం వైసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జగన్ డిజిటల్ బుక్ గురించి వివరించారు.
కూటమి ప్రభుత్వంలో కార్యకర్తకు ఏదైనా అన్యాయం జరిగితే డిజిటల్ బుక్ లోకి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు డిజిటల్ బుక్ శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేసిన కేసులమీద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు జగన్ ప్రకటించారు.
అన్యాయం చేసిన వాళ్లు రిటైర్ అయినా, రాష్ట్రంలో లేకపోయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా
అందరినీ పిలిచి, చట్టం ముందు నిలబెట్టడం ఖాయం అని హెచ్చరించారు. అన్యాయానికి గురైన వారికి సంతోషం కలిగించేలా చర్యలు ఉంటాయన్నారు. రెడ్‌బుక్ రెడ్‌బుక్ అంటున్నారని కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో అందరికీ అర్థమవుతుందన్నారు.









