OG Collections News | ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగస్టర్ పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించిన ‘ఓజి’ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.
ఈ క్రమంలో ఎక్కడ చూసినా ఓజి మేనియా కనిపిస్తోంది. థియేటర్ల వద్ద అభిమానులు పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ లు ఏర్పాటు చేసి, బాణసంచా బ్యాండుతో హల్చల్ చేస్తూ ఓజికి స్వాగతం పలికారు. ఇదే సమయంలో ఓవర్సీస్ లో ఓజి ప్రీమియర్స్ సరికొత్త రికార్డును అందుకుంది.
కేవలం నార్త్ అమెరికాలోనే ప్రీమియర్స్ ద్వారా ఏకంగా 3 మిలియన్ డాలర్లను వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఓవర్సీస్ లో ఓజి రూ.26 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ప్రీమియర్స్ ద్వారానే 3 మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి సినిమాగా ఓజి రికార్డు క్రియేట్ చేసింది. మరే స్టార్ హీరో కూడా ఈ ఘటన సాధించకపోవడం విశేషం.









