TG Highcourt Shock to OG | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో చిత్రించిన సినిమా ‘ఓజీ’. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సెప్టెంబర్ 24న రాత్రి ప్రీమియర్ షోలతో పాటుగా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో బుధవారం ఓజీ ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు నుంచి ఓజీ సినిమాకు ఊహించని షాక్ ఎదురైంది.
రాష్ట్రంలో ఓజీ సినిమా టికెట్ ధరల పెంపును తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారించిన న్యాయస్థానం.. బుధవారం టికెట్ ధరల పెంపును సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.









