MEGA POWER film of the CENTURY | మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో వివరించారు దర్శకుడు రాంగోపాల్ వర్మ.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని వెండితెరకు పరిచయం చేసిన సినిమా ‘ప్రాణం ఖరీదు’. సెప్టెంబర్ 22 నాటికి అది విడుదలై 47 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో తన అన్నయ్య చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై ఆర్జీవి స్పందించారు.
‘మీరిద్దరూ కలిసి సినిమా చేస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు మీరు ఒక మెగా పవర్ సహాయం చేసినవారవుతారు. అది ఈ శతాబ్దంలోని మెగా పవర్ చిత్రం అవుతుంది’ అని ఆర్జీవి పేర్కొన్నారు.









