Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > హిమాచల్ లో వరదల ప్రళయం..కర్ణాటక భారీ సాయం

హిమాచల్ లో వరదల ప్రళయం..కర్ణాటక భారీ సాయం

CM siddaramaiah has extended support to flood hit Himachal Pradesh | హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ప్రళయం సృష్టించాయి.

వరదల మూలంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో సహాయం చేసేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ లో ప్రజల పునరావాసం మరియు సహాయం కోసం రూ.5 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవింధర్ సింగ్ సుక్కు కు లేఖ రాశారు. హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చిన వినాశకరమైన వరదలు అనేక ప్రాణాలు, ఇళ్లు మరియు జీవనోపాధులను నాశనం చేశాయని సీఎం సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలు ఈ విషాద సమయంలో హిమాచల్ ప్రజలతో సంఘీభావంగా నిలబడతారని పేర్కొన్నారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions