Asia Cup-2025 | ఆసియా కప్-2025లో భాగంగా అసలైన పోరుకు సర్వం సిద్ధమయ్యింది. టీం ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆదివారం రాత్రి తలపడనుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ తో మ్యాచ్ రద్దు చేయాలని ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో రాత్రి జరగబోయే మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీం ఇండియాతో జాగ్రత్తగా ఉండాలని సొంత జట్టుకు సూచించారు. పాకిస్థాన్ తో ఆధిపత్యం చేలాయించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే భారత్ ఫైనల్స్ లో పాక్ తో కాకుండా అఫ్ఘనిస్తాన్ తో ఆడటానికి ఇష్టపడుతుందని కామెంట్ చేశారు. ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్భా ఉల్ హాక్ మరో రకంగా వ్యాఖ్యానించాడు.
జట్టులో కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్లు లేరు, కాబట్టి టాప్ ఆర్డర్ ను పడగొడితే పాకిస్థాన్ కు మంచి అవకాశం ఉంటుందన్నారు. అయితే ఈ వ్యాఖ్యల్ని షోయబ్ కొట్టిపారేశారు. సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకు సింగ్ వంటి ఆటగాళ్లు ఉన్నారని, అభిషేక్ శర్మను మర్చిపోకూడదని అన్నారు.









