CM Revanth Reddy visit’s to Osmania University | భారత రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి వస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్లాట్లు చేసి అమ్మేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆయన సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పర్యటించారు. రూ.80 కోట్లతో నిర్మించిన వసతి గృహాలను ప్రారంభించారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రభుత్వంలోని ఖాళీలను గుర్తించి త్వరలోనే 40 వేల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ అవిభక్త కవలలు అని పేర్కొన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, పార్టీలు నీరసపడిన తరుణంలో ఉద్యమానికి ఓయూ ఊపిరి పోసిందని గుర్తుచేశారు.
అయితే తిరిగి బీఆరెస్ అధికారంలోకి వస్తే ఉస్మానియాను లే-అవుట్లు చేసి అమ్మేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏనుగులు, సింహాలు ఎక్కడా లేవని కానీ బీఆరెస్ సోసిల్ మీడియా మాత్రం కంచె గచ్చిబౌలి భూముల్లో కృతిమమేధ సహాయంతో సింహాలను, ఏనుగులను సృష్టించారని విమర్శించారు.









