CM Revanth Independence Day Speech | భారత దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అహింసా పద్దతిలో స్వాతంత్య్ర సాధించి, పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని గుర్తు చేశారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందన్నారు.
దేశ భవిష్యత్ మనల్ని పిలుస్తోందంటూ నెహ్రూ చేసిన ప్రసంగం చిరస్మరణీయమనీ, ఆయన స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు.
ఆ మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాహసోపేత నిర్ణయాలతో సాగుతోందనీ, ప్రపంచ నగరాలతో పోటీపడే నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నామని వివరించారు.
సంక్షేమానికి కేరాఫ్ అంటే కాంగ్రెస్ పాలన అన్నారు. రేషన్ షాపులతో సన్నబియ్యం, రూ.2 లక్షల రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటి అనేక పథకాలు అందిస్తున్నామని తెలిపారు.
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదనీ, మన వాటా సాధించేవరకు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్.









