Saturday 19th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘పెట్టుబడులు రాకుండా ఈ-మెయిల్స్ పంపాడు..ఎవరంటే!’

‘పెట్టుబడులు రాకుండా ఈ-మెయిల్స్ పంపాడు..ఎవరంటే!’

Nara Lokesh News | ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో గురువారం మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతమైందని, ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే పెట్టుబడులను ఏపీకి రాకుండా అడ్డుకోవాలని ఓ వ్యక్తి ఏకంగా సింగపూర్ అధికారులకు ఈ-మెయిల్స్ పంపాడని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో అస్థిర ప్రభుత్వం ఉందని, అది ఏ క్షణమైనా పడిపోవచ్చని ఈ మెయిల్స్ లో సదరు వ్యక్తి రాసినట్లు మంత్రి చెప్పారు. రేపోమాపో ప్రభుత్వం పడిపోతుంది, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు అని ఈ మెయిల్స్ పంపినట్లు లోకేశ్ మీడియాకు వెల్లడించారు. సింగపూర్ అధికారులకు ఈ మెయిల్స్ పంపిన వ్యక్తి పేరు మురళి కృష్ణ అని పేర్కొన్నారు.

ఇతను మాజీ మంత్రి, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన ఓ సంస్థ ఉద్యోగులతో నిరంతరం మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలతో సైతం సంభాషించినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ పార్టీ కుట్రలు చేస్తుందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions