Harihara Veeramallu Latest | హరిహర వీరమల్లు చిత్రం సాధించిన అఖండ విజయంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధులకు కడుపు మండుతోందని అన్నారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్.
ఆ మంటతోనే చరిత్ర పేరు చెప్పి కొంత మంది వక్రభాష్యాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. కల్పిత పాత్ర అని చెప్పాక కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఔరంగజేబు ఆకృత్యాలు చూపితే వారికి అంత ఆక్రోశం ఎందుకో అర్థం కావడం లేదన్నారు.
పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎప్పుడూ సినిమాలు తీయలేదని తెలిపారు. కల్పిత పాత్రలతో చేసిన చిత్రం మీద గాయి గాయి చేస్తున్నవాళ్ళు, ఔరంగజేబు అకృత్యాల గురించి ఎందుకు నోరు మెదపరో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అలాగే ముస్లింలు సైతం హరిహర వీరమల్లు సినిమాను మెచ్చుకుంటున్నారని చెప్పారు.









